Gopichand: మరో మాస్ డైరెక్టర్ కి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్!

Gopichand  in Hari Movie

  • 'పక్కా కమర్షియల్'తో రానున్న గోపీచంద్
  • జులై 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు    
  • సెట్స్ పై శ్రీవాస్ సినిమా 
  • 'సింగం' దర్శకుడికి ఓకే చెప్పిన గోపీచంద్  

గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో 'పక్కా కమర్షియల్' సినిమా రూపొందింది. ఇది యాక్షన్ కామెడీతో కూడిన మారుతి మార్కు సినిమా. గోపీచంద్ సరసన నాయికగా రాశి ఖన్నా కనిపించనుంది. జులై 1వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఆ తరువాత సినిమాను శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ చేయనున్నాడు.

ఈ నేపథ్యంలోనే మాస్ సినిమాల దర్శకుడిగా పేరున్న'హరి'కి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తమిళంలో విక్రమ్ హీరోగా 'సామి' ..  సూర్య హీరోగా సింగం 1.. 2.. 3 చేసిన దర్శకుడిగా అక్కడ ఆయనకి మంచి క్రేజ్ ఉంది. అయితే  కొంతకాలంగా అక్కడ ఆయనకి సక్సెస్ లేదు. దాంతో తెలుగు వైపు దృష్టి పెట్టాడు.

 టాలీవుడ్ లో మాస్ యాక్షన్ హీరోగా గోపీచంద్ కి మంచి క్రేజ్ ఉంది. అందువలన ఇటీవల ఆయనను కలిసిన హరి .. ఒక కథ  చెప్పడం, అందుకు గోపీచంద్ ఓకే అనడం జరిగిపోయాయని అంటున్నారు. ఈ సినిమాకి నిర్మాతను కూడా గోపీచంద్ సెట్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.  

Gopichand
Maruthi
Hari Movie
  • Loading...

More Telugu News