Upendra: చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది... కానీ, బ్యాడ్ లక్: ఉపేంద్ర

I missed opportunity to direct Chiranjeevi says Upendra

  • అవకాశం వచ్చినా చిరంజీవికి దర్శకత్వం వహించలేక పోయానన్న ఉపేంద్ర 
  • ఆ విషయం గురించి ఇప్పటికీ బాధపడుతుంటానని వ్యాఖ్య 
  • మెగా ఫ్యామిలీ తనకు మళ్లీమళ్లీ అవకాశాలు ఇస్తూనే ఉందని ఆనందం 

కన్నడ స్టార్ హీరో అయినప్పటికీ... తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు ఉపేంద్ర. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఉపేంద్రకు చెరగని స్థానం ఉంది. డైరెక్ట్ తెలుగు చిత్రాల్లో సైతం ఆయన నటించి, అంతులేని అభిమానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా వరుణ్ తేజ్ నటించిన 'గని' చిత్రంలో కూడా ఉపేంద్ర కీలక పాత్రను పోషించారు. రామ్ గోపాల్ వర్మ కూడా ఉపేంద్ర హీరోగా మాఫియా డాన్ కథాంశంతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

ఇక వరుణ్ తేజ్, ఉపేంద్ర కాంబినేషన్లో వస్తున్న 'గని' రేపు విడులవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాదులో నిన్న ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 24 ఏళ్ల క్రితం వచ్చిన 'ఉపేంద్ర' సినిమా నుంచి తాను ఏంటో అందరికీ తెలుసని ఆయన అన్నారు. 

24 ఏళ్ల క్రితం రాజశేఖర్ గారితో 'ఓంకారం' సినిమాను డైరెక్ట్ చేస్తున్న సమయంలో... చిరంజీవి గారిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందని తెలిపారు. ఆ సినిమాకు అశ్వనీదత్ గారు నిర్మాత అని... అయితే, తనకు ఆ సినిమాకు దర్శకత్వం వహించే అదృష్టం లేకపోయిందని, ఆ సినిమా చేయలేకపోయానని, ఇప్పటికీ దాని గురించి బాధ పడుతుంటానని చెప్పారు. 

అయితే మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ తో కలిసి 'సన్నాఫ్ సత్యమూర్తి' చేశానని, ఇప్పుడు వరుణ్ తేజ్ తో 'గని' చేశానని ఉపేంద్ర తెలిపారు. ఈ కుటుంబం తనకు మళ్లీ మళ్లీ అవకాశాలను ఇస్తోందని ధన్యవాదాలు తెలిపారు. కన్నడలో కూడా 'గని' ఘన విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం తనకుందని చెప్పారు.

Upendra
Chiranjeevi
Tollywood
Gani Movie
  • Loading...

More Telugu News