Telangana: తెలంగాణలో ఇలాంటివి నడవవ్.. ఎంఐఎం కార్పొరేటర్ పై మంత్రి కేటీఆర్ ఫైర్

KTR Asks DGP To Take Action Against MIM Corporator
  • చర్యలు తీసుకోవాలంటూ డీజీపీని కోరిన కేటీఆర్  
  • ఎవరైనా సరే ఉపేక్షించవద్దని సూచన
  • నిన్న అర్ధరాత్రి పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్ హల్ చల్
  • ట్విట్టర్ లో కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చిన నెటిజన్
ఎంఐఎం కార్పొరేటర్ తీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నిన్న అర్ధరాత్రి దాటాక భోలక్ పూర్ డివిజన్ లో డ్యూటీ చేస్తున్న పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ రుబాబు చేసిన సంగతి తెలిసిందే. 

దీనిపై ట్విట్టర్ లో నెటిజన్ ఒకరు వీడియోను ట్యాగ్ చేస్తూ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఘటనపై స్పందించిన కేటీఆర్.. కార్పొరేటర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ మహేందర్ రెడ్డిని మంత్రి కోరారు.  

పోలీసుల విధులకు ఆటంకం కలిగించే ఎవరినైనా ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. తెలంగాణలో ఇలాంటి రచ్చను ఉపేక్షించవద్దన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే ఎంతటివారైనా, ఏ రాజకీయపార్టీకి చెందిన వారైనా వదలకూడదని సూచించారు.
Telangana
MIM
Corporator
TRS
KTR
DGP
TS DGP
Police
Hyderabad Police
TS Police

More Telugu News