Pavan Kalyan: అందుకే ఎక్కువ సినిమాలు చేయడం లేదు: నిధి అగర్వాల్

Hari Hara Veeramallu movie update

  • పవన్ సరసన చేస్తున్న 'హరి హర వీరమల్లు'
  • నిదానమే ప్రధానమంటున్న నిధి
  • సరైన పాత్రల కోసం వెయిటింగ్  
  • సక్సెస్ కావాలంటే సహనం ఉండాలన్న నిధి  

టాలీవుడ్ లోని గ్లామరస్ హీరోయిన్స్ లో నిధి అగర్వాల్ ఒకరు. 'సవ్యసాచి' సినిమాతో ఈ సుందరి తెలుగు తెరకి పరిచయమైంది. చైతూ సరసన ఆమె చేసిన ఈ సినిమా పరాజయం పాలైనా, ఆ వెంటనే అఖిల్  జోడీగా 'మిస్టర్ మజ్ను' సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అయితే ఆ సినిమా కూడా ఆమెకి నిరాశనే మిగిల్చింది. 

ఈ మధ్య 'హీరో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిధి అగర్వాల్ చేతిలో 'హరి హర వీరమల్లు' సినిమా ఉంది. కావలసినంత గ్లామర్ పెట్టుకుని కాలయాపన చేయడానికి కారణమేమిటనే ప్రశ్న ఆమెకి ఎదురైంది. అందుకు ఆమె స్పందిస్తూ .. "వరుస అవకాశాలు వస్తున్నాయి .. కానీ నేనే ఒప్పుకోవడం లేదు.

దూకుడుగా వచ్చిన సినిమానల్లా ఒప్పేసుకుంటూ పోతే, ఎంత త్వరగా క్రేజ్ వస్తుందో అంతే త్వరగా పోతుంది. అందువలన నిదానమే ప్రధానమన్నట్టుగా ఒక్కో సినిమాను చేసుకుంటూ వెళదామనే అనుకున్నాను. అలా అయితేనే నిలబడతామని నా నమ్మకం. ఇక్కడ సక్సెస్ కావాలంటే సహనం ఉండాలి .. మంచి పాత్రల కోసం ఎదురుచూడాలనేది నా అభిప్రాయం" అని చెప్పుకొచ్చింది.

Pavan Kalyan
Nidhi Aagarwal
Krish
Hari Hara Veeramallu Movie
  • Loading...

More Telugu News