Ramcharan: పంజాబ్ లో చరణ్ - శంకర్ మూవీ మేజర్ షెడ్యూల్!

shankar and Charan movie update

  • ఈ నెల 29న విడుదల కానున్న 'ఆచార్య'
  • శంకర్ సినిమా కొత్త షెడ్యూల్ కి సన్నాహాలు
  • కథానాయికగా కియారా అద్వాని  
  • ప్రతి నాయకుడిగా తెరపైకి అరవింద్ స్వామి పేరు

చరణ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆచార్య' సిద్ధమవుతోంది. కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవితో కలిసి చరణ్ ఈ సినిమాలో నటించాడు. ఒక రకంగా ఇది మల్టీ స్టారర్ సినిమానే అనుకోవాలి. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో విడుదలవుతోంది. 
 
ఇక ఈ సినిమా తరువాత శంకర్ దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'ఆర్ ఆర్ ఆర్' .. 'ఆచార్య' తరువాత చరణ్ ఫ్రీ కావడం వలన, ఇక త్వరలో కొత్త షెడ్యూల్ ను మొదలుపెడుతున్నట్టుగా తెలుస్తోంది. రాజమండ్రి .. హైదరాబాద్ .. దుబాయ్ లలో కొంత చిత్రీకరణ చేయనున్నట్టు చెప్పారు. 

కీలకమైన కొన్ని సన్నివేశాలను పంజాబ్ .. అమృత్ సర్ ప్రాంతాలలో చిత్రీకరణ చేయనున్నారనేది తాజా సమాచారం. కియారా అద్వాని కథానాయికగా అలరించనున్న ఈ సినిమాలో, ప్రతినాయకుడి పాత్రను అరవిందస్వామి పోషించనున్నట్టు తెలుస్తోంది. శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి .. నవీన్ చంద్ర .. జయరామ్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

Ramcharan
Kiara Adwani
Shankar Movie
  • Loading...

More Telugu News