Rammohan Naidu: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కుమార్తెకు చాక్లెట్లు ఇచ్చిన మోదీ!

Modi gives chocolates to Rammohan Naidu daughter
  • భార్య, కూతురుతో కలిసి మోదీని కలిసిన రామ్మోహన్ నాయుడు
  • ఆత్మీయంగా పలకరించిన ప్రధాని
  • రామ్మోహన్ నాయుడు కూతురుని ఆశీర్వదించిన మోదీ
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తన భార్య, కూతురుతో కలిసి ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా వారితో మోదీ ఆత్మీయంగా మాట్లాడారు. రామ్మోహన్ నాయుడు కూతురుని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చిన్నారికి మోదీ చాక్లెట్లు ఇచ్చారు. అంతకు ముందు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ కుమార్తెకు కూడా మోదీ చాక్లెట్లు ఇచ్చారు.

మరోవైపు ఈరోజు జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో పార్టీ ఎంపీలకు మోదీ కీలక సూచనలు చేశారు. ప్రజాసేవ కోసం బీజేపీ ఎంపీలందరూ జీవితాలను అంకితం చేయాలని చెప్పారు. వివిధ వర్గాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు.
Rammohan Naidu
Telugudesam
Daughter
Narendra Modi
BJP

More Telugu News