Varun Tej: గ్లామర్ షో చేయడానికి నేను రెడీ: సయీ మంజ్రేకర్

Ghani movie update

  • వరుణ్  తేజ్ హీరోగా రూపొందిన 'గని'
  •  బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ 
  • కథానాయికగా సయీ మంజ్రేకర్ పరిచయం
  • ఈ నెల 8వ తేదీన విడుదల

తెలుగు తెరకు ఈ మధ్య కాలంలో ముంబై భామలు వరుసగా పరిచయమవుతున్నారు. కియారా అద్వానీ .. అలియా భట్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ నెల 8వ తేదీన విడుదలవుతున్న 'గని' సినిమాతో సయీ మంజ్రేకర్ పరిచయం కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె కూడా చాలా బిజీగా ఉంది.

తాజా ఇంటర్వ్యూలో సయీ మంజ్రేకర్ మాట్లాడుతూ .. "వరుణ్ తేజ్ జోడీగా ఈ సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. పవన్ కల్యాణ్ గారి 'వకీల్ సాబ్' చూశాను. అల్లు అర్జున్ 'పుష్ప'  .. చరణ్ 'మగధీర' సినిమాలను కూడా నేను చూశాను. వాళ్ల నటన నాకు బాగా నచ్చుతుంది.

 దక్షిణాది భాషలన్నిటిలో సినిమాలు చేయాలనుకుంటున్నాను. అన్ని రకాల పాత్రలను పోషించాలనుకుంటున్నాను. కథకి అవసరమైతే గ్లామర్ షో చేయడానికి నేను సిద్ధమే. ఈ సినిమా తరువాత 'మేజర్' విడుదలవుతుంది. ఆ సినిమాలో నేను చేసిన పాత్ర కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది" అని చెప్పుకొచ్చింది.

Varun Tej
Saiyee Manjrekar
Ghani Movie
  • Loading...

More Telugu News