Youtube Channels: 22 యూట్యూబ్ చానళ్లపై నిషేధం కొరడా ఝళిపించిన కేంద్రం

Centre bans youtube channels

  • వివిధ మాధ్యమాలపై కేంద్రం డేగకన్ను
  • 18 దేశీయ, 4 పాక్ యూట్యూబ్ చానళ్లపై వేటు
  • పలు సామాజిక మాధ్యమాల ఖాతాలపైనా చర్యలు

సామాజిక మాధ్యమాల్లో దేశ సమగ్రతను దెబ్బతీసే అంశాలను కేంద్రం నిశితంగా గమనిస్తోంది. ఈ క్రమంలో 22 యూట్యూబ్ చానళ్లపై నిషేధం విధించింది. దేశభద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. నిషేధానికి గురైన వాటిలో 18 దేశీయ యూట్యూబ్ చానళ్లు కాగా, 4 పాకిస్థాన్ యూట్యూబ్ చానళ్లున్నాయి. 

దేశభద్రత, ప్రజాక్షేమం దృష్ట్యా వీటిని నిషేధించినట్టు కేంద్రం వెల్లడించింది. ఆయా యూట్యూబ్ చానళ్లు టీవీ చానళ్ల లోగోలు వాడుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని వివరించింది. యూట్యూబ్ చానళ్లనే కాకుండా 3 ట్విట్టర్ ఖాతాలు, ఒక ఫేస్ బుక్ అకౌంట్, ఒక న్యూస్ వెబ్ సైట్ ను కూడా నిషేధించినట్టు తెలిపింది.
 

  • Loading...

More Telugu News