Ghost: నాగార్జున 'ఘోస్ట్' సినిమా కోసం స్టంట్ సీన్... షూటింగ్ అని తెలియక హడలిపోయిన తేయాకు కూలీలు

Bizarre incident at Nagarjuna Ghost movie shooting spot

  • నాగార్జున హీరోగా ఘోస్ట్
  • ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ మూవీ
  • కూనూరులో షూటింగ్
  • కారు గాల్లోకి లేచే సన్నివేశం చిత్రీకరణ

టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం ఘోస్ట్ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, నార్త్ స్టార్ ఎంటర్టయిన్మెంట్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఇందులో నాగ్ సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఘోస్ట్ చిత్రం షూటింగ్ తమిళనాడులోని కూనూరు తేయాకు తోటల వద్ద జరుగుతోంది. అయితే, ఓ స్టంట్ సన్నివేశం చిత్రీకరణ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 

ఇక్కడి తుటర్కట్టం ప్రాంతంలో ఓ కారు గాల్లోకి లేచే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇంతలో ఆ కారు 150 అడుగుల ఎత్తుకు లేచి ఓ తేయాకు తోటలో పడింది. అయితే, ఆ సమయంలో తేయాకు తోటలో కొందరు కూలీలు పనిచేస్తున్నారు. అక్కడికి సమీపంలో షూటింగ్ జరుగుతోందన్న విషయం వారికి తెలియదు. దాంతో, ఆ కారు తమ తోటలో పడగానే భయంతో పరుగులు తీశారు. 

నిజంగానే కారు ప్రమాదానికి లోనైందని భావించి పోలీసులకు సమాచారం అందించారు. ఊళ్లోకి వెళ్లి స్థానికులకు విషయం తెలియజేశారు. చివరికి అది నాగార్జున నటిస్తున్న ఘోస్ట్ సినిమా షూటింగ్ అని తెలియడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. 

Ghost
Nagarjuna
Koonor
Shooting
Car
Stunt Scene
Tea Gardens
Tamilnadu
Tollywood
  • Loading...

More Telugu News