Botsa Satyanarayana: చంద్ర‌బాబు నోటికి ప్లాస్ట‌ర్ వేసుకోవాలి: ఏపీ మంత్రి బొత్స

botsa harsh comments on chandrababu

  • జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై చంద్రబాబు విమ‌ర్శ‌లు
  • వాటిని గుర్తు చేసుకున్న మంత్రి బొత్స‌
  • స‌ల‌హాలు ఇస్తే ఫ‌ర‌వా లేదు గానీ విమ‌ర్శ‌లు చేయొద్దంటూ సూచ‌న‌

టీడీపీ అధినేత‌, ఏపీ అసెంబ్లీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబునాయుడిపై వైసీపీ కీల‌క నేత‌, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న చంద్ర‌బాబు ఇక‌పై విమ‌ర్శ‌లు చేయొద్దంటూ బొత్స వ్యాఖ్యానించారు.  

సోమ‌వారం నాడు మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా త‌మ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న చంద్ర‌బాబుపై బొత్స విరుచుకుప‌డ్డారు. ఏపీ కూడా మ‌రో శ్రీలంక‌లా అవుతుందంటూ ఇటీవ‌ల చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేసిన బొత్స‌.. చంద్ర‌బాబు అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం దుర్మార్గ‌మ‌ని అన్నారు.

జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తుంటే చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. మంచి స‌ల‌హాలు ఇవ్వ‌లేక‌పోతే కనుక చంద్ర‌బాబు నోటికి ప్లాస్ట‌ర్ వేసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా బొత్స అన్నారు. చంద్రబాబు స‌ల‌హాలు ఇస్తే ఫ‌ర‌వా లేదు గానీ, విమ‌ర్శ‌లు చేయొద్దంటూ ఆయన వ్యాఖ్యానించారు.

Botsa Satyanarayana
YSRCP
Chandrababu
TDP
  • Loading...

More Telugu News