: 'వీరప్పన్' భార్యకు పాతిక లక్షల పరిహారం!


బతికున్న ఏనుగుకైనా... చనిపోయిన ఏనుగుకైనా ఒకటే రేటు... అనేవారు గతంలో. అంటే, చనిపోయినా కూడా ఏనుగుకు విలువ ఏమాత్రం తగ్గదనేది అందులోని అర్ధం. మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి, చివరికి అదే పోలీసుల చేతిలో కుక్క చావు చచ్చిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ విలువ కూడా ఇప్పుడు అలాగే ఉన్నట్టుంది.

అతని కథ ఆధారంగా తీసిన 'వనయుద్ధం' చిత్ర నిర్మాతలు వీరప్పన్ భార్య ముత్తులక్ష్మికి 25 లక్షలు సమర్పించుకున్నారు. ఈ సినిమాలో తన భర్తను అమానవీయ కోణంలో చూపించారనీ, ఈ సినిమా విడుదల తర్వాత సమాజంలో తమ పరిస్థితి దారుణంగా ఉండచ్చనీ ముత్తులక్ష్మి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో, పరిహారంగా ఆమెకు పాతిక లక్షలు ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించడంతో, కోర్టు సినిమా విడుదలకు అనుమతినిచ్చింది!    

  • Loading...

More Telugu News