Prabhas: ప్రభాస్ లుక్స్ పై స్పందించిన 'ఆది పురుష్' డైరెక్టర్!

Adi Purush movie Update

  • షూటింగు పూర్తిచేసుకున్న 'ఆది పురుష్'
  • శ్రీరాముడిగా కనిపించనున్న ప్రభాస్
  • దర్శకుడిగా ఓం రౌత్ 
  • వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు  

'బాహుబలి' సినిమా చూసినవారు ఆ పాత్రలో ప్రభాస్ ను తప్ప మరెవరినీ ఊహించుకోలేమని చెప్పారు. అయితే 'రాధేశ్యామ్' సినిమా విషయానికి వచ్చేసరికి కథాకథనాలలో ప్రేక్షకులకు కొత్తదనం కనిపించలేదు. ఆ సంగతి అలా ఉంచితే లుక్స్ పరంగా ప్రభాస్ చాలా మారిపోయాడు. మునుపటి ఆకర్షణ ఆయనలో లోపించడం అభిమానులను అసంతృప్తికి గురిచేసింది.   

ఈ సినిమా విడుదల తరువాత కథాకథనాల గురించి కాకుండా ప్రభాస్ లుక్స్ గురించి మాట్లాడుకున్నవారే ఎక్కువ. అది గమనించిన 'ఆది పురుష్' డైరెక్టర్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రను ప్రభాస్ పోషించాడు. ఈ పాత్రలో సన్నని నడుము .. విశాలమైన భుజాలతో ఆయన కనిపించవలసి ఉంటుంది.

అందుకోసం ఆయన మరింత ఫిట్ నెస్ ను సంపాదించవలసి వచ్చింది. ఎక్కువ సమయం జిమ్ లోనే గడిపాడు. తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం కోసం మరింత పెర్ఫెక్ట్ గా హిందీ నేర్చుకున్నాడు. ఈ సినిమాలో ఆయన కళ్లు కూడా చాలా షార్ప్ గా ఉంటాయి" అని చెప్పుకొచ్చాడు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Prabhas
Krithi Sanon
Saif Alikhan
Adi Purush Movie
  • Loading...

More Telugu News