Yami Gautam: హీరోయిన్ యామీ గౌతమ్ కు షాకిచ్చిన హ్యాకర్లు!

Actress Yami Gautam Instagram account hacked
  • యామీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను హ్యాక్ చేసిన హ్యాకర్లు
  • ట్విట్టర్ ద్వారా విషయాన్ని తెలిపిన యామీ
  • అకౌంట్ ను పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయని వెల్లడి
బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నాలుగు టాలీవుడ్ చిత్రాల్లో ఆమె నటించింది. గత ఏడాది పెళ్లి చేసుకున్న ఆమె... పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తోంది. హిందీలో ఆమె నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండగా... మరో సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.  

మరోవైపు, యామీ గౌతమ్ కు హ్యాకర్లు షాక్ ఇచ్చారు. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపింది. తన ఇన్స్టా అకౌంట్ ను యాక్సెస్ చేయలేకపోతున్నానని... బహుశా హ్యాక్ అయి ఉండొచ్చని ఆమె తెలిపింది. తన అకౌంట్ ను పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయని చెప్పింది. ఈ లోపల తన అకౌంట్ నుంచి ఇబ్బందికరమైన పోస్టులు వస్తే... అవి తాను పెట్టినట్టు భావించవద్దని విన్నవించింది. మరోవైపు ఇన్స్టాలో ఆమెకు 15.1 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు.
Yami Gautam
Bollywood
Tollywood
Instagram
Hack

More Telugu News