Galla Jayadev: హైదరాబాద్‌లోని పబ్‌లో గల్లా అశోక్ దొరికిపోయినట్లు వార్తలు.. స్పందించిన కుటుంబ సభ్యులు!
![galla family responds on pus case](https://imgd.ap7am.com/thumbnail/cr-20220403tn62495521bb683.jpg)
- గల్లా అశోక్ కు ఎలాంటి సంబంధం లేదు
- దయచేసి నిరాధారమైన వార్తలని మీడియాలో ప్రసారం చేయకూడదు
- ప్రకటన చేసిన గల్లా కుటుంబ సభ్యులు
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌పై పోలీసులు జరిపిన దాడిలో పలువురు ప్రముఖుల పిల్లలు పట్టుబడిన విషయం తెలిసిందే. అందులో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు, సినీ నటుడు గల్లా అశోక్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే, ఈ విషయంపై స్పందించిన గల్లా కుటుంబ సభ్యులు ఆ వ్యవహారంలో గల్లా అశోక్ కు ఎలాంటి సంబంధం లేదని ఓ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. దయచేసి అలాంటి నిరాధారమైన వార్తలని మీడియాలో ప్రసారం చేయకూడదని గల్లా జయదేవ్ కుటుంబ సభ్యులు కోరారు. పబ్‌లో డ్రగ్స్ కూడా లభ్యం కావడంతో ఈ కేసు హైదరాబాద్‌లో హాట్ టాపిక్‌గా మారింది.