Telangana: కొత్త జిల్లాల ఏర్పాటు అధికారం తెలంగాణ సర్కారుకు ఉంది: హైకోర్టు

Telangana has powers to create new districts High court

  • అధికారాల పరిధిలోనే ప్రభుత్వం వ్యవహరించింది
  • చెడు ఉద్దేశ్యాలున్నట్టు పిటిషనర్లు నిరూపించలేకపోయారు
  • అటువంటప్పుడు న్యాయ సమీక్ష కుదరదు
  • స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం

జిల్లాలను పెంచే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాల పరిధిలోనే వ్యవహరించినట్టు రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. ఈ పిటిషన్ ను రంగు బాల లక్ష్మి, వరంగల్ కు చెందిన మరో నలుగురు కలసి దాఖలు చేశారు. 

ప్రభుత్వం జిల్లాలను అశాస్త్రీయ విధానంలో, ఏకపక్షంగా విభజించిందని పిటిషనర్లు ఆరోపించారు. ఇందుకు సంబంధించి అధికారులు అనుసరించిన విధానం తెలంగాణ డిస్ట్రిక్స్ యాక్ట్ 1974, తెలంగాణ డిస్ట్రిక్స్ రూల్స్ 2016 నిబంధనలకు విరుద్ధంగా ఉందని వాదించారు. ఈ వాదనలను విన్న చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం జిల్లాల ఏర్పాటు అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తేల్చి చెప్పింది.

కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు వెనుక చెడు ఉద్దేశ్యాలున్నట్టు పిటిషనర్లు నిరూపించలేకపోయినట్టు ధర్మాసనం పేర్కొంది. తప్పుడు ఉద్దేశ్యాలు లేనప్పుడు న్యాయ సమీక్ష కుదరదని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News