Karnataka: క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నికల‌కు రాహుల్ త్రిసూత్ర వ్యూహం

rahul gandhi focus on karnataka assembly elections

  • త్వ‌ర‌లోనే క‌ర్ణాట‌క అసెంబ్లీకి ఎన్నిక‌లు
  • ఎన్నిక‌ల్లో పార్టీ వ్యూహంపై రాహుల్ ప్ర‌సంగం
  • 150 సీట్ల గెలుపే ల‌క్ష్యంగా సాగాలన్న రాహుల్ 

2024లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల కంటే ముందుగానే క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో గురువారం నాడు క‌ర్ణాట‌క ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత రాహుల్ గాంధీ.. శుక్ర‌వారం కూడా అక్క‌డే ఉన్నారు. గురువారం నాడు సిద్ద గంగ మ‌ఠాన్ని సంద‌ర్శించిన రాహుల్ గాంధీ.. శ్రీ శివ‌కుమార స్వామీజీకి నివాళి అర్పించారు. తాజాగా శుక్ర‌వారం బెంగ‌ళూరులో పార్టీ కీల‌క నేత‌ల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా త్వ‌ర‌లో క‌ర్ణాట‌క అసెంబ్లీకి జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు సంబంధించి పార్టీ అనుస‌రించాల్సిన వ్యూహంపై రాహుల్ గాంధీ పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త్రిసూత్ర వ్యూహాన్ని ప్ర‌క‌టించారు. క‌ర్ణాట‌క అసెంబ్లీలో 150 సీట్ల గెలుపే ల‌క్ష్యంగా సాగాల‌న్న రాహుల్‌.. ప్ర‌తిభ ఆధారంగానే నిర్ణ‌యాలు ఉండాలంటూ దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం అవిశ్రాంతంగా క‌ష్ట‌ప‌డిన నేత‌ల‌కు గుర్తింపు ఇచ్చేలా నిర్ణ‌యాలు ఉండాలంటూ ఆయ‌న పార్టీ క‌ర్ణాట‌క శాఖ‌కు సూచించారు.

  • Loading...

More Telugu News