northeast: ఈశాన్యంలో కాంగ్రెస్ కనుమరుగు!.. 4 రాజ్యసభ సీట్లు ఎన్డీయే ఖాతాలోకే
![NDA wins 4 northeast RS seats in historic Congress wipeout](https://imgd.ap7am.com/thumbnail/cr-20220401tn6246989a44972.jpg)
- తాజా ఎన్నికల్లో నాలుగింటిలోనూ విజయం
- ఈశాన్య రాష్ట్రాలకు రాజ్యసభలో 14 స్థానాలు
- ఎన్డీయే ఖాతాలో 13.. ఒకటి స్వతంత్ర అభ్యర్థి చేతిలో
ఈశాన్య భారత్ లో నాలుగు రాజ్యసభ స్థానాలను ఎన్డీయే సొంతం చేసుకుంది. బీజేపీ ఖాతాలోకి మూడు వెళ్లగా, ఒకటి భాగస్వామ్య పక్షం గెలుచుకుంది. దీంతో పెద్దల సభలో ఈశాన్య రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం కరవైంది. పార్లమెంటరీ చరిత్రలో కాంగ్రెస్ కు ఈ పరిస్థితి ఎదురుకావడం ఇదే మొదటిసారి. త్రిపుర, నాగాలాండ్ బీజేపీ ఖాతాలోకి చేరిపోయాయి. పోటీ లేకుండానే నాగాలాండ్ ను బీజేపీ సొంతం చేసుకుంది. త్రిపుర స్థానాన్ని సీపీఎం కోల్పోయింది.