KTR: ముగిసిన కేటీఆర్ అమెరికా ప‌ర్య‌ట‌న‌.. ఏం సాధించారంటే..!

ktr america tour completed

  • వారం పాటు అమెరికాలో కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌
  • రూ.7,500 కోట్ల పెట్టుబ‌డుల‌ను సాధించిన వైనం
  • ప‌ర్య‌ట‌న ముగిసింద‌ని ప్ర‌క‌టించిన కేటీఆర్‌

తెలంగాణ‌కు మ‌రిన్ని పెట్టుబ‌డులు రాబట్టేందుకు అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ సోమ‌వారం త‌న ప‌ర్య‌ట‌న ముగిసిన‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో త‌మ బృందం ఏం సాధించింద‌న్న విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు.

కేటీఆర్ ట్వీట్ ప్ర‌కారం.. వారంపాటు సాగిన అమెరికా ప‌ర్య‌ట‌న‌లో కేటీఆర్ బృందం తెలంగాణ‌కు ఏకంగా రూ.7,500 కోట్ల విలువైన పెట్టుబ‌డుల‌ను సాధించింది. 35 స‌మావేశాల్లో పాలుపంచుకున్న‌ కేటీఆర్‌.. 4 రౌండ్ టేబుల్ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యారు. 3 చోట్ల భారీ ఎత్తున మీట్ అండ్ గ్రీట్ స‌మావేశాల‌ను నిర్వ‌హించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో మంచి ఫ‌లితాల‌ను సాధించిందంటూ త‌న ప్ర‌తినిధి బృందానికి కేటీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

  • Loading...

More Telugu News