Roja: పుత్తూరులో ఫిష్ అవుట్ లెట్ ను ప్రారంభించిన రోజా... ఫొటోలు ఇవిగో!

Roja inaugurated Fish Andhra outlet in Puttur
  • ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఫిష్ అవుట్ లెట్లు
  • ఫిష్ ఆంధ్ర-ఫిట్ ఆంధ్ర నినాదంతో అమ్మకాలు
  • ప్రజలకు తాజా చేపలు అందించడమే ముఖ్యోద్దేశం
ఫిష్ ఆంధ్ర-ఫిట్ ఆంధ్ర నినాదంతో ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేపల దుకాణాలు ఏర్పాటు చేస్తుండడం తెలిసిందే. తాజా, ఆరోగ్యకరమైన చేపలను సరసమైన ధరలకు ప్రజలకు అందించాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. తాజాగా చిత్తూరు జిల్లాలోని పుత్తూరు గోవిందపాలెంలోనూ ఫిష్ ఆంధ్ర మినీ అవుట్ లెట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఫిష్ స్టాల్ ను వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసిన రోజా చేపలను ప్రదర్శిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు.
.
Roja
Fish Outlet
Fish Andhra-Fit Andhra
Puttur
YSRCP
Andhra Pradesh

More Telugu News