Bandla Ganesh: ప్రొద్ద‌టూరు కోర్టులో బండ్ల గ‌ణేశ్‌.. చెక్ బౌన్స్ కేసు విచార‌ణ‌కు హాజ‌రు

bandla ganesh appears before proddaturu court
  • బండ్ల గ‌ణేశ్‌పై చెక్ బౌన్స్ కేసు
  • ఈ కేసుపై ప్రొద్ద‌టూరు కోర్టులో విచార‌ణ‌
  • తానెవ‌రికీ అప్పు లేనన్న బండ్ల గ‌ణేశ్‌
టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత, న‌టుడు బండ్ల గ‌ణేశ్ సోమ‌వారం నాడు కడ‌ప జిల్లా ప్రొద్ద‌టూరు కోర్టులో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. త‌న‌పై న‌మోదైన ఓ చెక్ బౌన్స్ కేసు విచార‌ణ‌కు ఆయ‌న హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ను ప‌ల‌క‌రించిన మీడియాతో మాట్లాడిన ఆయ‌న ప‌లు ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. 

తానెవ‌రికీ అప్పు లేన‌ని చెప్పిన బండ్ల గ‌ణేశ్.. త‌న‌పై త‌ప్పుడు కేసులు బ‌నాయించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న‌పై న‌మోదైన త‌ప్పుడు కేసుల‌పై న్యాయ పోరాటం ద్వారానే గెలుస్తానని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు.
Bandla Ganesh
Cheque Bounce Case
Proddaturu Court

More Telugu News