Prashant Kishor: పలు సూచనలతో కేసీఆర్ కు ప్రశాంత్ కిశోర్ నివేదిక?

Prashant Kishor suggestions to KCR

  • రాబోయే ఎన్నికల కోసం పీకేతో చేతులు కలిపిన కేసీఆర్
  • అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహిస్తున్న పీకే టీమ్
  • సర్వే ఫలితాలను సమీక్షించి కేసీఆర్ కు నివేదిక అందించిన పీకే

వచ్చే ఎన్నికల కోసం తెలంగాణలోని అన్ని పార్టీలు అప్పుడే సమాయత్తమవుతున్నాయి. తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి అన్ని పార్టీల నాయకత్వాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. మరోవైపు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు కలిపారు. 

రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించే బాధ్యతలను పీకే తన భుజాన వేసుకున్నారు. వందల సంఖ్యలో ఉండే తన టీమ్ ను పీకే అప్పుడే రంగంలోకి దించారు. తనదైన శైలిలో ప్రతి నియోజకవర్గంలో సర్వేలు నిర్వహిస్తున్నారు. సర్వే ఫలితాలను సమీక్షిస్తూ... ఏం చేయాలి? ఎలా ముందుకు సాగాలి? తదితర సలహాలను కేసీఆర్ కు ఇస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా కేసీఆర్ కు పీకే తన నివేదికను సమర్పించినట్టు సమాచారం. 

  నివేదికలో ఉన్న కీలక అంశాలు.. 
  • టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. 
  • అధికారిక విధుల్లో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోకుండా చూడాలి. 
  • రెండు సార్లు ప్రభుత్వ హయాంలో పదవులు లభించని పాత నాయకులకు న్యాయం చేయాలి. 
  • అధికారుల బదిలీలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను ఏడాదిలోగా పూర్తి చేయాలి. 
  • జిల్లా, జోన్, మల్టీ జోన్, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. 
  • బీజేపీ దూకుడును, ప్రచారాన్ని ఎదుర్కోవడానికి సోషల్ మీడియా సెల్ ను ఏర్పాటు చేయాలి. 
  • ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వరాదు. 
  • సీనియర్, జూనియర్ నేతల మధ్య అంతరాన్ని తగ్గించాలి. 
  • సంక్షేమ పథకాలను ప్రజల్లో హైలైట్ చేయాలి.

  • Loading...

More Telugu News