Telangana: తెలంగాణలో మరో 36 మందికి కరోనా పాజిటివ్
![Telangana corona daily update](https://imgd.ap7am.com/thumbnail/cr-20220326tn623f2b23770b1.jpg)
- గత 24 గంటల్లో 20,427 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 19 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 75 మంది
- ఇంకా 536 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 20,427 శాంపిల్స్ పరీక్షించగా, 36 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అందులో సగానికి పైగా కేసులు హైదరాబాదులోనే వెలుగు చూశాయి. నగరంలో 19 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 75 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు.
రాష్ట్రంలో ఇప్పటిదాకా 7,91,110 మంది కరోనా బారినపడగా, వారిలో 7,86,463 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 536 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
![](https://img.ap7am.com/froala-uploads/20220326fr623f2b04f2f9a.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20220326fr623f2b141b0c6.jpg)