IPL: ఐపీఎల్ మ్యాచ్ లకు ఉగ్రవాదుల ముప్పు.. రెక్కీ నిర్వహించిన టెర్రరిస్టులు!

Terrorists did recce near IPL Stadium

  • ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించారన్న క్విక్ రెస్పాన్స్ బాంబ్ స్క్వాడ్
  • స్టేడియంల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని నిర్ణయం
  • ఇంటెలిజెన్స్ ఇన్ పుట్స్ లేవన్న డిప్యూటీ పోలీస్ కమిషనర్

రేపటి నుంచి ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. అయితే ఐపీఎల్ మ్యాచ్ లకు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని క్విక్ రెస్పాన్స్ బాంబ్ స్క్వాడ్ హెచ్చరికలు జారీ చేసింది. మ్యాచ్ లు జరగనున్న స్టేడియంల వద్ద, క్రికెటర్లు బస చేసే హోటల్ వద్ద టెర్రరిస్టులు రెక్కీ నిర్వహించినట్టు సమాచారం. దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం స్టేడియంల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 

మరోవైపు ముంబై డిప్యూటీ పోలీస్ కమిషనర్ సంజయ్ లట్కర్ మాట్లాడుతూ ఐపీఎల్ కు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్టు ఇంటెలిజెన్స్ ఇన్ పుట్స్ లేవని చెప్పారు. ఆటగాళ్లు బస చేసే హోటల్ వద్ద టెర్రరిస్టులు రెక్కీ నిర్వహించారంటూ కొన్ని మీడియాలలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. అయితే హోటల్ ట్రైడెంట్, వాంఖడే స్టేడియం, ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న 1.5 కిలోమీటర్ల మార్గంలో తగినంత భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు.

  • Loading...

More Telugu News