Vijayasai Reddy: ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
- ఢిల్లీలో మోదీతో విజయసాయి భేటీ
- శాలువా కప్పి సన్మానం
- మోదీకి వినాయక ప్రతిమ అందించిన వైనం
- ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చ
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. మోదీకి శాలువా కప్పి సన్మానించి విజయసాయి, ఆయనకు వినాయకుడి ప్రతిమను అందజేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో వెల్లడించారు. ప్రధానిని కలిసి ఏపీకి సంబంధించిన అనేక అంశాలపై చర్చించినట్టు విజయసాయి తెలిపారు.
అంతకుముందు, విజయసాయిరెడ్డిని ఆయన కార్యాలయంలో ఈ ఉదయం కొందరు తెలుగు విద్యార్థులు కలిశారు. వారు ఢిల్లీ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్నారు. మన తెలుగు విద్యార్థులను కలవడం ఆనందంగా ఉందని విజయసాయి ఓ ట్వీట్ లో పేర్కొన్నారు. ఢిల్లీ వర్సిటీలో చదువుకుంటున్న ఆ తెలుగు విద్యార్థులు అదే సమయంలో సివిల్స్ కు సన్నద్ధమవుతున్నారని వెల్లడించారు.
.