Confluent Medical Technologies: హైదరాబాదులో అమెరికా వైద్య పరికరాల తయారీ సంస్థ పైలట్ ప్రాజెక్టు

US medical devices manufacturer comes to Hyderabad

  • అమెరికాలో కేటీఆర్ పర్యటన
  • పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న మంత్రి  
  • కాన్ ఫ్లుయెంట్ మెడికల్ టెక్నాలజీస్ తో అవగాహన

తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రధానంగా పెట్టుబడులు రాబట్టేందుకు అమెరికా వెళ్లిన ఆయన ఆ దిశగా సఫలమైనట్టే భావించాలి. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో ఆసక్తికర అంశం వెల్లడించింది. అమెరికాకు చెందిన కాన్ ఫ్లుయెంట్ మెడికల్ టెక్నాలజీస్ సంస్థ తెలంగాణలో కాలుమోపనుందని తెలిపింది. 

ఆరిజోనా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ వైద్య పరికరాల తయారీ సంస్థ హైదరాబాదులో ప్రయోగాత్మకంగా ఓ పైలట్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుందని పేర్కొంది. ఈ మేరకు అమెరికాలో కేటీఆర్ కు, కాన్ ఫ్లుయెంట్ మెడికల్ టెక్నాలజీస్ సంస్థ డైరెక్టర్, సీఈవో, అధ్యక్షుడు డీన్ షాయర్ తో అవగాహన కుదిరిందని ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వివరించింది. 

కాగా, ఈ అమెరికా సంస్థ నిటినోల్ (నికెల్, టైటానియ్ లోహాల మిశ్రమం)తో వైద్య ఉపకరణాల తయారీలో పేరెన్నికగన్నదని వెల్లడించింది. రాబోయే 12 నెలల్లో తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను కంపెనీ మంత్రి కేటీఆర్ తో పంచుకుందని తెలిపింది.

  • Loading...

More Telugu News