Raghu Rama Krishna Raju: ప్ర‌ధానికి లేఖ రాయ‌డం త‌ప్పా?.. లోక్‌స‌భ‌లో ర‌ఘురామకృష్ణరాజు

raghurama krishna raju fires on ysrcp in lok sabha

  • ఏపీ మ‌ద్యం నాణ్య‌త‌పై ప‌రీక్ష‌లు చేయించిన ఎంపీ
  • ఆ నివేదిక‌ను ప్ర‌ధానికి పంపిన వైనం
  • ల్యాబ్ టెస్టులు, నివేదిక‌పై ఏపీ ప్ర‌భుత్వం ఆగ్ర‌హం
  • ఇదేం ప‌ద్ద‌తి? అంటూ పార్ల‌మెంటులో ర‌ఘురామ‌రాజు ప్రశ్న  

ఏపీ ప్ర‌భుత్వం అమ్ముతున్న మ‌ద్యం నాణ్య‌తపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి లేఖ రాసిన త‌న‌పై వైసీపీ స‌ర్కారు క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంద‌ని వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు లోక్ సభలో అన్నారు. ఓ ప్ర‌జా ప్ర‌తినిధిగా, పార్ల‌మెంటు స‌భ్యుడిగా రాష్ట్ర ప్ర‌జ‌ల ఆరోగ్యంపై శ్ర‌ద్ధ‌తోనే తాను ప్ర‌ధానికి లేఖ రాశాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఈ మేర‌కు ప్ర‌ధానికి లేఖ రాశాన‌న్న కార‌ణంతో త‌న‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం య‌త్నిస్తోంద‌ని ర‌ఘురామ‌రాజు లోక్ స‌భ‌లో ప్ర‌స్తావించారు.

బుధ‌వారం నాటి లోక్ స‌భ స‌మావేశాల్లో ఈ అంశాన్ని లేవ‌నెత్తిన ర‌ఘురామ‌రాజు.. మ‌ద్యం నాణ్య‌త‌పై ప‌రీక్ష‌లు చేయించ‌డం త‌ప్పా? లేదంటే ఆ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన వివ‌రాల‌ను ప్ర‌ధానికి తెలియ‌జేయ‌డం త‌ప్పా? అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మాత్రం దానికి త‌న‌పై క్రిమిన‌ల్ కేసులు అని, ప‌రువు న‌ష్టం దావా అని వైసీపీ స‌ర్కారు ప్ర‌క‌ట‌న‌లు చేస్తోంద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News