Telangana ministers: ఢిల్లీ బయలుదేరిన తెలంగాణ మంత్రుల బృందం
- నిరంజన్, కమలాకర్, అజయ్‌లతో మంత్రుల బృందం
- కేంద్ర మంత్రులతో వరుస భేటీలు
- మొత్తం ధాన్యాన్ని కొనేలా కేంద్రాన్ని ఒప్పించడమే లక్ష్యం
యాసంగిలో తెలంగాణలో పండే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ముగ్గురు మంత్రులతో కూడిన తెలంగాణ మంత్రుల బృందం కాసేపటి క్రితం ఢిల్లీ ఫ్లైటెక్కింది. ఈ బృందంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్‌లున్నారు.
ఇక ఢిల్లీకి చేరుకున్న మరుక్షణమే అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను వీరు కలుస్తారు. ధాన్యం కొనుగోళ్లపై వారితో చర్చిస్తారు. పంజాబ్, హర్యానాల్లో పండిన మొత్తం ధాన్యాన్ని కొంటున్న కేంద్రం తెలంగాణ ధాన్యం విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్న తీరుపై వారు కేంద్ర మంత్రులను నిలదీయనున్నారు. వాస్తవ పరిస్థితులను కేంద్ర మంత్రుల ముందు ఉంచనున్న తెలంగాణ మంత్రులు.. వీలయినంతమేరకు మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఒప్పించే దిశగా తమ వంతు యత్నాలు చేయనున్నారు.