traffic: ట్రాఫిక్ చ‌లాన్ల రాయితీ ప్ర‌క‌టించ‌డంతో తెలంగాణ ప్ర‌భుత్వానికి భారీగా ఆదాయం

traffic challans

  • ఈ నెల‌ 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు భారీగా క‌ట్టిన వాహ‌న‌దారులు
  •  గ్రేటర్ హైద‌రాబాద్‌ పరిధిలోనే 1.2 కోట్ల చలాన్లు క్లియర్‌ 
  • ప్రభుత్వ ఖజానాకు వారి నుంచి రూ.112.98 కోట్లు  

ట్రాఫిక్ చ‌లాన్లు క‌ట్ట‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం రాయితీ ప్ర‌క‌టించ‌డంతో పెద్ద ఎత్తున వాహ‌న‌దారులు వాటిని క్లియ‌ర్ చేస్తోన్న విష‌యం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఖజానాకు సొమ్ము భారీగా జమ అవుతోంది. ఈ నెల‌ 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గ్రేటర్ హైద‌రాబాద్‌ పరిధిలో 1.2 కోట్ల చలాన్లు క్లియర్‌ చేశారని అధికారులు తెలిపారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు వారి నుంచి రూ.112.98 కోట్లు వ‌చ్చాయి. 

హైదరాబాద్ క‌మిష‌న‌రేట్‌ పరిధిలో మొత్తం 63 లక్షల చలాన్లు క‌ట్టడంతో రూ. 49.6 కోట్ల ఆదాయం స‌మ‌కూరింది. అలాగే, రాచకొండ క‌మిష‌న‌రేట్‌ ప‌రిధిలో మొత్తం 16 లక్షల చలాన్లు క్లియర్ చేయ‌గా, వాటి ద్వారా ప్ర‌భుత్వానికి రూ.15.3 కోట్లు వ‌చ్చాయి. ఇక‌ సైబరాబాద్‌లో 38 లక్షల చలాన్లు క్లియర్ కావ‌డంతో రూ.45.8 కోట్లు ప్ర‌భుత్వ ఖ‌జానాలో చేరాయి. రాయితీ గ‌డువు ఈ నెల 31 వ‌ర‌కు ఉండ‌డంతో ఈ చివ‌రి రోజుల్లోనూ భారీ సంఖ్య‌లో చ‌లాన్లు క్లియ‌ర్ అయ్యే అవ‌కాశం ఉంది.

  • Loading...

More Telugu News