KCR: మందు తాగిస్తూ చిందులు వేసిన ఎమ్మెల్యేపై కేసీఆర్ సీరియస్

KCR gives strong warning to MLA Shankar Nayak
  • హోలీ రోజున అనుచరులకు మందు తాగిస్తూ చిందులు వేసిన శంకర్ నాయక్
  • ఎమ్మెల్యేపై వెల్లువెత్తిన విమర్శలు
  • ఇంకో సారి ఇలా చేస్తే పార్టీ నుంచి సాగనంపుతానన్న కేసీఆర్
మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హోలీ పండుగ రోజు రచ్చ చేసిన సంగతి తెలిసిందే. తన అనుచరులకు మందు నోట్లో పోస్తూ, డ్యాన్సులు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యేపై విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో, శంకర్ నాయక్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని, ఇప్పటికే మీపై చాలా ఫిర్యాదులు వచ్చాయని మండిపడ్డారు. పార్టీ పరువు తీసే పనులు చేసేటట్టయితే... పార్టీ నుంచి వెళ్లి పోవాలని స్పష్టం చేశారు. ఇలా చేయడం క్షమించరాని నేరమని... మరోసారి ఇది రిపీట్ అయితే పార్టీ నుంచి సాగనంపుతానని హెచ్చరించారు.   
KCR
TRS
Shankar Nayak
Liquor

More Telugu News