Aadi Pinishetty: కన్నడ బ్యూటీతో ఆది పినిశెట్టి పెళ్లి?

Adi Pinishetty

  • 'కృష్ణాష్టమి'తో తెలుగు తెరకి నిక్కీ గల్రాని పరిచయం 
  • ఆది పినిశెట్టితో రెండు సినిమాలు  
  • ప్రేమగా మారిన పరిచయం
  • త్వరలోనే పెళ్లి పీటలపైకి

తెలుగు తెరకి పరిచయమైన కన్నడ బ్యూటీలలో సంజనా గల్రాని .. నిక్కీ గల్రాని కనిపిస్తారు. ఈ మధ్యనే సంజనా ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. ఇక త్వరలో నిక్కీ గల్రాని వివాహం ఆది పినిశెట్టితో  జరగనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సునీల్ హీరోగా  చేసిన 'కృష్ణాష్టమి' సినిమాతో తెలుగు తెరకి నిక్కీ పరిచయమైంది.

ఆ తరువాత ఆమె ఆది పినిశెట్టి జోడీగా 'మలుపు' .. 'మరకతమణి' సినిమాలు చేసింది. ఈ సమయంలోనే వాళ్ల మధ్య పరిచయం  ప్రేమగా మారిందని చెబుతారు. ఆది పినిశెట్టి ఫ్యామిలీ ఫంక్షన్స్ కి నిక్కీ హాజరవుతూ ఉండటంతో ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు కోలీవుడ్లో షికారు చేశాయి.

ఈ ఇద్దరి కుటుంబ సభ్యులు వీరి వివాహానికి ఒప్పుకోవడంతో, త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆది పినిశెట్టి అటు హీరోగాను .. ఇటు విలన్ గాను ప్రేక్షకులను మెప్పిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. త్వరలోనే వీరి పెళ్లి విషయంలో స్పష్టత రానుంది.

Aadi Pinishetty
Nikki Galrani
Kollywood
  • Loading...

More Telugu News