Muralidhar Rao: జై శివాజీ అంటే నేరమా? కేసీఆర్ కు చరిత్ర విధించబోయే శిక్ష మామూలుగా ఉండదు: మురళీధర్ రావు

History will punish KCR says Muralidhar Rao

  • తెలంగాణ భారతదేశంలో ఉందా? లేక పాకిస్థాన్ లో ఉందా? 
  • హిందువుల గురించి మాట్లాడితే మత పిచ్చి అంటారు
  • బాధ్యతా రాహిత్యంగా మాట్లాడితే ఖబడ్దార్ అన్న బీజేపీ నేత 

బోధన్ లో బీజేపీ, శివసేన కార్యకర్తలు శివాజీ విగ్రహాన్ని నెలకొల్పడం ఉద్రిక్తతలకు దారి తీసింది. విగ్రహాన్ని తొలగించాలంటూ మైనార్టీ వర్గీయులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో 144 సెక్షన్ విధించారు. 

మరోవైపు ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం పార్టీలపై మండిపడ్డారు. తెలంగాణ భారతదేశంలో ఉందా? లేక పాకిస్థాన్ లో ఉందా? అని ప్రశ్నించారు. మహారాష్ట్ర పర్యటనకు వెళ్లినప్పుడు శివాజీని కేసీఆర్ పొగిడారని... కానీ నిన్న బోధన్ లో శివాజీ విగ్రహం అంశంలో మాత్రం ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ హిందువులపై దాడి చేసిందని అన్నారు. 

ఎంఐఎం పార్టీ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఇస్లాం కారిడార్ ను, టెర్రర్ కారిడార్ ను ఏర్పాటు చేస్తుందని మురళీధర్ రావు చెప్పారు. ఎంఐఎంకు టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. హిందువుల గురించి మాట్లాడితే మత పిచ్చి అంటున్నారని... ఇంకోసారి బాధ్యతా రాహిత్యంగా మాట్లాడితే ఖబడ్దార్ కేసీఆర్ అంటూ ఆయన హెచ్చరించారు. ముస్లిం మతోన్మాదానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు కేసీఆరే కారణమని అన్నారు. కేసీఆర్ కు చరిత్ర విధించబోయే శిక్ష మామూలుగా ఉండదని హెచ్చరించారు.

Muralidhar Rao
Telangana
KCR
TRS
  • Loading...

More Telugu News