Telangana: తెలంగాణలో 35 కరోనా కేసులు... తాజా బులెటిన్ ఇదిగో!
![Telangana corona daily update](https://imgd.ap7am.com/thumbnail/cr-20220320tn6237428f5206c.jpg)
- గత 24 గంటల్లో 13,569 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 21 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 91 మంది
- ఇంకా 657 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 13,569 కరోనా పరీక్షలు నిర్వహించగా, 35 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 21 కేసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో 5, హన్మకొండ జిల్లాలో 3, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 3, ఖమ్మం జిల్లాలో 1, సంగారెడ్డి జిల్లాలో 1, యాదాద్రి జిల్లాలో 1 కేసు నమోదు కాగా... మిగిలిన జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.
అదే సమయంలో 91 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్కరోజు వ్యవధిలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,90,791 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,86,023 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 657 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మరణించారు.
![](https://img.ap7am.com/froala-uploads/20220320fr623742706f75b.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20220320fr6237427f6859f.jpg)