Girl: 8 ఏళ్ల చిన్నారి.. ఏడాది సంపాదన రూ.200 కోట్లు

8 Years Youtuber Girl Earns 200 Cr Last year

  • చిన్నప్పుడే సెరిబ్రల్ పాల్సీ వ్యాధి
  • మాట్లాడలేరని చెప్పిన వైద్యులు
  • మాటలు వచ్చేందుకు యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేయించిన తల్లిదండ్రులు

సాధారణంగా 8 ఏళ్ల వయసులో పిల్లలేం చేస్తుంటారు? బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. అల్లరి చేస్తారు. అమ్మానాన్నల వద్ద మారాం చేస్తుంటారు. కానీ, రష్యాకు చెందిన అనస్తాషియా రజిన్స్ కాయా మాత్రం కోట్లు సంపాదిస్తోంది. అవును, వరుసగా కొన్నేళ్ల నుంచి అత్యధిక వార్షికాదాయం పొందుతున్న చిన్నారి యూట్యూబర్ గా ఆమె రికార్డులను తిరగరాస్తోంది. 

అవును, గత ఏడాది కూడా ఆమె రూ.200 కోట్లను తన యూట్యూబ్ చానెళ్ల ద్వారా సంపాదించింది. తద్వారా 2021లో అత్యధిక ఆదాయం పొందిన చిన్నారిగా రికార్డు సృష్టించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 చానెళ్లను ఆమె ఏకధాటిగా నిర్వహించడం మామూలు విషయం కాదు. 

ప్రధానంగా ‘లైక్ నాస్త్య’ అనే ఆమె నిర్వహిస్తున్న చానెల్ ప్రధానమైంది. ఆ చానెల్ కు 8.6 కోట్ల మంది సబ్ స్క్రైబర్స్ ఉండడం విశేషం. మొత్తంగా ఆమె యూట్యూబ్ చానెళ్లకు 26 కోట్ల మంది సబ్ స్క్రయిబర్లున్నారు. అయితే, అంత ఆస్తి ఉన్నా.. ఎంత సంపాదించినా.. ఆ చిన్నారి  చిన్నప్పుడే  సెరిబ్రల్ పాల్సీ జబ్బు బారిన పడడం విషాదం. 

ఎప్పటికీ ఆమె మాట్లాడే అవకాశం లేదని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారట. దీంతో 2015లో వారు ఓ యూట్యూబ్ చానెల్ ను ప్రారంభించి.. చిన్నారితో మాట్లాడించే ప్రయత్నం చేశారట. అలా కొద్దిరోజుల్లోనే అనస్తాసియా మాట్లాడం నేర్చుకుందట. ఆ తర్వాతి ఏడాదే మరో చానెల్ ను పెట్టి మరింత ప్రోత్సహించారట. చిన్నచిన్నగా బొమ్మల రివ్యూను ఇవ్వడం ప్రారంభించారట. అలా అలా ఆమె సంపాదన మొదలుపెట్టింది. అత్యధిక సంపాదన పొందిన చిన్నారిగా పేరు తెచ్చుకుంది.

  • Loading...

More Telugu News