KTR: అమెరికా ఫ్లైటెక్కేసిన కేటీఆర్‌!

ktr takes off to america

  • శంషాబాద్ నుంచి బ‌య‌లుదేరిన కేటీఆర్‌
  • లాస్ ఏంజెలెస్ నుంచి మొద‌లుకానున్న టూర్‌
  • ఐటీ, పారిశ్రామిక పెట్టుబడుల సాధ‌నే లక్ష్యం

టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తారక‌రామారావు కాసేప‌టి క్రితం అమెరికా బ‌య‌లుదేరారు. ఈ మేర‌కు శంషాబాద్‌ ఎయిర్ పోర్టుకు చేరుకుని, విమానం ఎక్కి చిద్విలాసంగా కూర్చుని ఉన్న కేటీఆర్‌ ఫొటోల‌ను ఆయ‌న మిత్ర బృందం విడుద‌ల చేసింది.  రాష్ట్రానికి ఐటీ, పారిశ్రామిక పెట్టుబడులను సాధించేందుకు 10 రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. 

ఈ నెల 29 వరకు వీరు అమెరికాలోని తూర్పు, పశ్చిమ కోస్తా ప్రాంతాల్లో పర్యటిస్తారు. కేటీఆర్ వెంట వెళ్తున్న వారిలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ కారంపూరి ఉన్నారు. లాస్ ఏంజెలెస్ నుంచి వీరి పర్యటన మొదలు కానుండ‌గా.. శాండియాగో, శాన్ జోస్, బోస్టన్, న్యూయార్క్ లలో టూర్‌ కొనసాగుతుంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News