IOCL: రష్యా నుంచి భారీగా చమురు దిగుమతికి ఒప్పందం చేసుకున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

IOCL ready to import crude oil from a Russian oil firm

  • ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర
  • తీవ్ర ఆంక్షలు విధించిన అమెరికా తదితర దేశాలు
  • భారత చమురు కంపెనీలపై పడని ఆంక్షల ప్రభావం
  • రష్యా కంపెనీలతో ఒప్పందాలు
  • చవకగా లభిస్తున్న రష్యా ముడిచమురు

ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాతో ఇప్పుడే దేశం కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే సాహసం చేయబోవడంలేదు. అయితే, భారత్ కు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) రష్యా చమురు కంపెనీతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇది రష్యా ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం కాదని, ఓ కంపెనీ మరో కంపెనీతో చేసుకున్న ఒప్పందంగానే చూడాలని జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. 

ఈ ఒప్పందంలో భాగంగా రష్యా చమురు కంపెనీ నుంచి ఐవోసీఎల్ 3 మిలియన్ల బ్యారెళ్ల క్రూడాయిల్ ను దిగుమతి చేసుకోనుంది. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర నేపథ్యంలో... రష్యా చమురుపై అమెరికా, పాశ్చాత్య దేశాలు తీవ్ర ఆంక్షలు విధించాయి. అయితే ఈ ఆంక్షల ప్రభావం భారత చమురు కంపెనీలపై పడలేదు. అందుకే భారతీయ చమురు కంపెనీలు రష్యా ఇంధన సంస్థల నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్నాయి. 

పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలో, రష్యా సంస్థలు ఎంతో చవకగా చమురును విక్రయిస్తుండడంతో భారత్ కంపెనీలు ఇదే అదనుగా పెద్ద మొత్తంలో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News