Pawan Kalyan: జిల్లాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్క‌డ పోటీ చేసినా స‌రే ఓడిస్తా: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి

pawan slams ycp

  • ప‌వ‌న్ పోటీ చేసే నియోజకవర్గంలో నేనే వైసీపీ ఇన్‌చార్జిగా ఉంటాను
  •  పార్టీని ప్యాకేజీ కోసం ప‌వ‌న్ మళ్లీ తాకట్టు పెడుతున్నారు
  • పవన్ క‌ల్యాణ్‌ ను వెన్నుపోటు పొడవడం బాబుకు ఓ లెక్క కాదన్న ద్వారంపూడి 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా తాము ఓడిస్తామని స‌వాలు చేశారు. ప‌వ‌న్ పోటీ చేసే నియోజకవర్గంలో తాను వైసీపీ ఇన్‌చార్జిగా పోస్ట్ తీసుకుంటానని, అక్కడ పార్టీ కోసం పనిచేసి పవన్ ను ఓడిస్తానని తెలిపారు. 

పవన్ కల్యాణ్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయ‌న అన్నారు. జనసేన కార్యకర్తలకు ఆయ‌న మ‌ళ్లీ అన్యాయం చేస్తున్నారని, పార్టీని ప్యాకేజీ కోసం మళ్లీ తాకట్టు పెడుతున్నాడని ఆయ‌న అన్నారు. త్వరలో జన సైనికులు బాధపడే రోజు వస్తుందని చెప్పుకొచ్చారు. ఇలా ప్యాకేజీలకు అమ్ముడుపోయి.. నేతలు, కార్యకర్తలకు ప‌వ‌న్ కల్యాణ్‌ అన్యాయం చేయకూడ‌ద‌ని హితవు పలికారు. మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్‌నే వెన్నుపొటు పొడిచిన చ‌రిత్ర‌ చంద్రబాబుకు ఉంద‌ని, పవన్ క‌ల్యాణ్‌ ను వెన్నుపోటు పొడవడం ఆయ‌న‌కు ఓ లెక్కకాద‌ని అన్నారు.  


Pawan Kalyan
Janasena
YSRCP
Dwarampudi Chandrasekhar Reddy
  • Loading...

More Telugu News