Priyanka Chopra: అత్యంత ఖరీదైన కారును అమ్మేసిన ప్రియాంక చోప్రా.. ఎందుకంటే..!

Priyanka Chopra sells her Rolls Royce Ghost car
  • ప్రస్తుతం అమెరికాలో సెటిలైన ప్రియాంక
  • గ్యారేజ్ కే పరిమితమైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు
  • బెంగళూరు వ్యాపారవేత్తకు అమ్మేసిన వైనం
బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన ప్రియాంక చోప్రా ఇప్పుడు అమెరికాలో సెటిలైపోయింది. హాలీవుడ్ సింగర్ నిక్ జొనాస్ ను పెళ్లాడిన ప్రియాంక అక్కడే ఉంటోంది. హాలీవుడ్ ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె 'సైటడెల్' అనే వెబ్ మూవీతో బిజీగా ఉంది.

మరోవైపు ప్రియాంకకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. తనకు ఎంతో ఇష్టమైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును ఆమె అమ్మేసింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

పెళ్లయిన తర్వాత ప్రియాంక అమెరికాలోనే ఉంటుండటంతో రోల్స్ రాయిస్ కారు గ్యారేజ్ కే పరిమితమయింది. ఆ కారును వాడే అవకాశం లేకపోవడంతో దాన్ని అమ్మేసిందట. బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్త ఈ కారును కొన్నట్టు సమాచారం. మరో విషయం ఏమిటంటే బాలీవుడ్ లో రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును కొన్న తొలి నటి ప్రియాంక చోప్రానే కావడం గమనార్హం. ఈ కారు ఖరీదు రెండున్నర కోట్లు.
Priyanka Chopra
Bollywood
Car

More Telugu News