Bangladesh: బంగ్లాదేశ్ లోని ఇస్కాన్ టెంపుల్ పై 200 మంది దాడి..ఫొటోలు ఇవిగో!
- బంగ్లాదేశ్ లో రెచ్చిపోతున్న మతోన్మాదులు
- ఓల్డ్ ఢాకాలోని ఇస్కాన్ టెంపుల్ పై దాడి
- ఘటనలో పలువురు హిందువులకు గాయాలు
- హాజీ షఫీవుల్లా సారథ్యంలో దాడి జరిగినట్టు సమాచారం
పొరుగుదేశం బంగ్లాదేశ్ లో మతోన్మాదం రోజురోజుకూ పెరుగుతోంది. ఢాకాలోని ఇస్కాన్ టెంపుల్ పై రాత్రి దాదాపు 200 మంది అల్లరి మూకలు దాడి చేశారు. ఓల్డ్ ఢాకాలో వారీలోని 222 లాల్ మోహన్ సాహా వీధిలో ఇస్కాన్ రాధాకంట ఆలయం ఉంది. ఈ ఆలయంపై మతోన్మాదులు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు హిందువులు గాయపడ్డారు. హాజీ షఫీవుల్లా సారథ్యంలో ఈ దాడి జరిగినట్టు కొన్ని వర్గాలు తెలిపారు.
గత ఏడాది కూడా హిందూ ఆలయాలను టార్గెట్ చేసుకుని దాడులు జరిగాయి. కొమిల్లీ పట్టణంలోని దుర్గామాత గుడిలో ముస్లిం పవిత్ర గ్రంథం ఖురాన్ ను అవమానించినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో, హిందూ ఆలయాలు, హిందువుల నివాసాలపై దుండగులు దాడి చేశారు. దాదాపు 70 మంది హిందువుల ఇళ్లపై దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు తమ నేరాన్ని అంగీకరించారు. ఇరువర్గాలను రెచ్చగొట్టేలా ప్రేరేపించేందుకే ఫేస్ బుక్ పోస్టు చేసినట్టు కోర్టు ముందు నిందితులు ఒప్పుకున్నారు.