Hyderabad: హైదరాబాద్‌లో నేడు మూతపడనున్న ఫ్లై ఓవర్లు

in the eve of Shab e Barat Hyderabad fly overs will be closed today

  • గ్రీన్‌లాండ్, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మినహా అన్ని ఫ్లై ఓవర్లు మూసివేత
  • షబ్-ఎ-బరాత్ సందర్భంగా నిర్ణయం
  • వాహనదారులు సహకరించాలని విజ్ఞప్తి

గ్రీన్‌లాండ్, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మినహా నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లు మూతపడనున్నాయి. షబ్-ఎ-బరాత్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రాఫిక్ అదనపు కమిషనర్ తెలిపారు. రాత్రి పదిగంటల తర్వాత నెక్లెస్ రోడ్డు సహా అన్ని ఫ్లై ఓవర్లను మూసివేస్తున్నామని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. 

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, రోడ్డుప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.

  • Loading...

More Telugu News