Gujarath: పాఠ్యాంశంగా భగవద్గీత.. గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం
- 6 నుంచి 12వ తరగతి వరకు బోధన
- సిలబస్‌లో భగవద్గీతకు చోటు
- గుజరాత్ విద్యా శాఖ మంత్రి ప్రకటన
బీజేపీ పాలనలోని గుజరాత్ ప్రభుత్వం గురువారం నాడు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్యా శాఖ తీసుకున్న ఈ నిర్ణయం మేరకు గుజరాత్‌లో ఇకపై భగవద్గీత కూడా పాఠ్యాంశంగా మారనుంది. ఈ మేరకు విద్యార్థుల సిలబస్‌లో భగవద్గీతను ఓ అంశంగా చేర్చనున్నట్లు గుజరాత్ విద్యాశాఖ మంత్రి భూపేందర్ సింగ్ చూడాసమా గురువారం నాడు కీలక ప్రకటన చేశారు.
ఈ ప్రకటన ప్రకారం గుజరాత్ విద్యా వ్యవస్థలో ఇకపై భగవద్గీత కూడా ఓ పాఠ్యాంశంగా ఉంటుంది. ఆరో తరగతి నుంచి 12 వ తరగతి వరకు భగవద్గీతను పాఠ్యాంశంగా బోధిస్తారు.