Earth Quake: జపాన్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికల జారీ!
- ఉత్తర జపాన్లో భూకంపం
- రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతగా నమోదు
- వణికిపోయిన ఫుకుషిమా తీరం
జపాన్లో కాసేపటి క్రితం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం కారణంగా ఆ దేశంలో భారీ నష్టమే వాటిల్లినట్లుగా తెలుస్తోంది, ఉత్తర జపాన్లోని ఫుకుషిమా తీర ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ భూకంపం నేపథ్యంలో ఆ దేశంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ భూకంపం కారణంగా ఫుకుషిమా తీర ప్రాంతం వణికిపోయింది. దీనివల్ల జరిగిన నష్టం గురించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. 7.3 తీవ్రతతో చోటుచేసుకున్న ఈ భూకంపం కారణంగా భారీ నష్టమే జరిగి ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.