Narayana Murthy: వర్క్‌ ఫ్రమ్ హోమ్ నాకు అసలు ఇష్టం లేదు: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

I dont like work from home says Infosys Narayana Murthy

  •  ఐటీ ఉద్యోగులు ఇంటికే పరిమితం కావడం వల్ల ఉత్పాదకత తగ్గిందన్న మూర్తి 
  • కంపెనీల సంస్థాగత వ్యవహారాలు మందగించాయని వ్యాఖ్య 
  • 2020-21లో బంగ్లాదేశ్ కంటే మన తలసరి ఆదాయం తక్కువగా వుందని వెల్లడి 

కరోనా కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఇంటికే పరిమితమయిన సంగతి తెలిసిందే. చాలా రోజుల నుంచి వర్క్‌ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మళ్లీ కార్యాలయాల బాట పడుతున్నారు. తాజాగా దీనిపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి స్పందిస్తూ వ్యక్తిగతంగా తాను వర్క్ ఫ్రమ్ హోమ్ కు అభిమానిని కాదని చెప్పారు. ఇంటి నుంచి పని చేయడం తనకు ఇష్టం ఉండదని అన్నారు. ఐటీ ఉద్యోగులు ఇంటికే పరిమితం కావడం వల్ల ఉత్పాదకత తగ్గిందని చెప్పారు. కంపెనీల సంస్థాగత వ్యవహారాలు మందగించాయని అన్నారు. 2020-21లో బంగ్లాదేశ్ కంటే భారత్ తలసరి ఆదాయం తక్కువగా నమోదయిందని చెప్పారు.

  • Loading...

More Telugu News