NEET: ఇక అందరికీ 'నీట్'... గరిష్ఠ వయో పరిమితి నిబంధన ఎత్తివేసిన కేంద్రం

Govt lifts upper age limit forNEET aspirants

  • గతంలో 25 ఏళ్లు దాటితే నీట్ కు అనర్హత
  • అన్ని వయసుల వారికి నీట్ రాసే వెసులుబాటు 
  • ఈసారి నీట్ పరీక్షకు భారీగా హాజరయ్యే అవకాశం
  • విస్తృతస్థాయిలో అందుబాటులోకి వైద్య విద్య 

జాతీయ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్) ఆశావహులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న గరిష్ఠ వయో పరిమితి నిబంధనను తొలగించింది. గతంలో 25 ఏళ్లు దాటితే నీట్ కు అనర్హులుగా భావించేవారు. ఇప్పుడా నిబంధన ఎత్తివేస్తున్నట్టు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రకటించింది. తద్వారా అన్ని వయసుల వారికి నీట్ రాసే వెసులుబాటు కల్పించింది. 

కాగా, వయో పరిమితి నిబంధన తొలగించిన కారణంగా ఈ ఏడాది నీట్ కు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే అవకాశాలున్నాయి. అదే సమయంలో వైద్య కళాశాలల్లోనూ సీట్లకు విపరీతమైన పోటీ ఏర్పడొచ్చని నిపుణులు భావిస్తున్నారు. 

వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష నీట్ ఈ ఏడాది జూన్ లో జరిగే అవకాశం ఉంది. ఈ వారంలో నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నారు.

NEET
Upper Age Limit
NMC
Aspirants
India
  • Loading...

More Telugu News