foods: ఈ కూరగాయలతో కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టొచ్చు!

foods vegetables that lower cholesterol

  • కొలెస్ట్రాల్ పెరిగితే రక్తనాళాల్లో పూడికలు
  • గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు
  • సాల్యుబుల్ ఫైబర్ ఉండే పదార్థాలు మంచివి
  • వీటితో ఎల్డీఎల్ తగ్గుతుంది

శరీరానికి కొవ్వు పదార్థాలు అవసరమే. కానీ, పరిమితికి మించి కొవ్వులు శరీరంలోకి చేరితో అవి ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. కొవ్వుల్లోనూ మంచి, చెడు రకాలున్నాయి. చెడు కొవ్వులు (ఎల్డీఎల్) పెరిగిపోతే రక్త ప్రవాహ మార్గాలు మూసుకుపోయి గుండెపోటు, పక్షవాతం సమస్యలకు దారితీయవచ్చు. 

శరీరంలో కొవ్వు చేరినప్పటికీ.. రోజువారీ శారీరక వ్యాయామాల ద్వారా కరిగించుకోవచ్చు. వీటికి తోడు ఆహారంలో కొన్నింటిని చేర్చుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ ను నియంత్రణలో పెట్టుకోవచ్చు.

ఓట్స్
రోజూ ఒక కప్పు ఓట్స్ తీసుకోవడం ఎంతో మంచిది. ఇది రెండు గ్రాముల వరకు సాల్యుబుల్ ఫైబర్ ఇస్తుంది. ఒక అరటి పండు లేదా స్ట్రాబెర్రీలు కలిపి తీసుకుంటే మరో అర గ్రాము ఫైబర్ లభిస్తుంది. పోషక నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రోజులో 20-35 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. అందులో సాల్యుబుల్ ఫైబర్ కనీసం 5-20 గ్రాములు అయినా ఉండాలి. 

బార్లే
బార్లే, ముడి ధాన్యాలు తీసుకున్నా సాల్యుబుల్ ఫైబర్ లభిస్తుంది. దీనివల్ల గుండె జబ్బుల రిస్క్ ను తగ్గించుకోవచ్చు.

బీన్స్
సాల్యుబుల్ ఫైబర్ బీన్స్ లో తగినంత లభిస్తుంది. బీన్స్ తీసుకోవడం వల్ల దీనిలో ఉండే పీచు పదార్థం వల్ల (సాల్యుబుల్ ఫైబర్) వెంటనే ఆకలి కూడా వేయదు. బరువు తగ్గేందుకు కూడా సాయపడతాయి. సోయాబీన్స్ తోనూ ఇదే విధమైన ప్రయోజనాలు లభిస్తాయి.

ఫ్యాటీ ఫిష్
మాంసం కంటే చేపలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఎందుకంటే మాంసంతో ఎల్డీఎల్ ను పెంచే శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా శరీరంలోకి చేరతాయి. కానీ చేపల్లో ఉండే ఒమెగా ఫ్యాటీ3 యాసిడ్స్ ఎల్డీఎల్ ను తగ్గిస్తాయి. దాంతో గుండెకు రక్షణ ఏర్పడుతుంది. 

నట్స్
బాదం, వాల్ నట్స్, పీనట్స్ ను కనీసం 50 గ్రాముల పరిమాణంలో రోజూ తీసుకుంటే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ నట్స్ లో మంచి పోషకాలు కూడా ఉంటాయి.

పండ్లు
యాపిల్, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, సిట్రస్ జాతి పండ్లలో పెక్టిన్ లభిస్తుంది. ఇదొక రకమైన సాల్యుబుల్ ఫైబర్. ఇది ఎల్డీఎల్ ను తగ్గించడానికి సాయపడుతుంది.

వంట నూనెలు
సన్ ఫ్లవర్, కనోలా నూనెలతో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News