women: ఐదు రాష్ట్రాల అసెంబ్లీలలో ఈ విడత ఎక్కువ మంది మహిళలకు చోటు!

More women elected to 5 new assemblies this time

  • పంజాబ్ సభలో 13 మందికి చోటు
  • గత సభతో పోలిస్తే మహిళా సభ్యుల సంఖ్య రెట్టింపు
  • యూపీలో స్వల్పంగా పెరిగి 46కు చేరిక
  • ఉత్తరాఖండ్ సభలో ఆరుగురికి చోటు

గతంతో పోలిస్తే ఈసారి మహిళలకు చట్ట సభల్లో ఎక్కువ ప్రాతినిధ్యం దక్కింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వాలు కొలువుదీరనుండడం తెలిసిందే. 

ఈ ఎన్నికల ఫలితాలను పరిశీలించినప్పుడు.. 403 స్థానాలున్న యూపీ కొత్త సభలోకి 46 మంది మహిళా ఎమ్మెల్యేలు అడుగుపెడుతున్నారు. 2017 నాటి అసెంబ్లీలో 42 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉండగా, ఈ విడత నలుగురు పెరిగారు. 30 మంది బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు కాగా, బీజేపీ భాగస్వామ్య పక్షం ఆప్నాదళ్ నుంచి ముగ్గురు, ఎస్పీ నుంచి 12 మంది, కాంగ్రెస్ నుంచి ఒక్కరు వీరిలో ఉన్నారు.

60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో ఐదుగురు మహిళా ఎమ్మెల్యేలకు ఈ విడత స్థానం లభించింది. మణిపూర్ రాష్ట్ర చరిత్రలో మహిళా ఎమ్మెల్యేలకు ఎక్కువ ప్రాతినిధ్యం లభించింది ఇప్పుడే. 117 స్థానాలున్న పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీలోకి 13 మంది మహిళా ఎమ్మెల్యేలు ఈ విడత అడుగు పెట్టబోతున్నారు. గత సభలో ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలే ఉన్నారు. 70 సీట్లు ఉన్న ఉత్తరాఖండ్ లో ఆరుగురు మహిళా అభ్యర్థులకు బీజేపీ టికెట్లు ఇవ్వగా.. అందరూ గెలిచారు. గోవాలో 2017లో ఇద్దరు మహిళా అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా, ఈ విడత ముగ్గురు విజయం సాధించారు.

  • Loading...

More Telugu News