Telangana: పెద్దలను ఒప్పించి హిజ్రాను పెళ్లాడిన యువకుడు

Young man married Hijra with parents permission
  • మూడేళ్ల క్రితం హిజ్రా అఖిలతో స్నేహం
  • మూడు నెలలుగా ఇల్లెందులో సహజీవనం
  • ఘనంగా రూపేశ్-అఖిల వివాహం  
హిజ్రాను ప్రేమించి మూడు నెలలుగా ఆమెతో సహజీవనం చేస్తున్న ఓ యువకుడు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరిగిందీ ఘటన. భూపాలపల్లికి చెందిన రూపేశ్‌కు ఆళ్లపల్లి మండలం అనంతోగు గ్రామానికి చెందిన అఖిల అనే హిజ్రాతో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. స్నేహం చిగురించి ప్రేమకు దారితీసింది. దీంతో ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. 

ఇల్లెందులోని స్టేషన్‌బస్తీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని మూడు నెలలుగా సహజీవనం చేస్తున్నారు. అయితే, ఇలా తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా కలిసి ఉండడం ఇష్టంలేని రూపేశ్ తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించాడు. వారు కూడా అంగీకరించడంతో నిన్న రూపేశ్-అఖిలకు ఘనంగా వివాహం జరిగింది.
Telangana
Jayashankar Bhupalpally District
Yellandu
Hijra
Marriage

More Telugu News