Atchannaidu: ఈ బడ్జెట్ కు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి?: అచ్చెన్నాయుడు

Atchannaidu fires on AP budget

  • అమరావతికి బడ్జెట్ కేటాయింపులు లేవు
  • కేంద్ర నిధులపై ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం బతుకుతోంది
  • ఇది మోసపూరిత బడ్జెట్ అంటూ అచ్చెన్న కామెంట్ 

వైసీపీ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు పెదవి విరిచారు. ఇది ఒక మోసపూరిత బడ్జెట్ అని విమర్శించారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినా... దీనికి తగిన రీతిలో బడ్జెట్ కేటాయింపులు లేవని దుయ్యబట్టారు. అమరావతి ప్రస్తావనే బడ్జెట్ లో లేకపోవడం దారుణమని అన్నారు. 

పాత పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తున్నారని అచ్చెన్న ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులపై ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం బతుకుతోందని అన్నారు. అప్పుల కోసం తిరగడం తప్ప సంక్షేమం గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నారని, ప్రజలపై పన్నుల రూపేణా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రూ. 2,56,257 కోట్ల బడ్జెట్ కు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News