Sensex: ఈ వారాన్ని లాభాలతో ముగించిన మార్కెట్లు

Markets ends in profits

  • 86 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 36 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3.69 శాతం లాభపడ్డ సన్ ఫార్మా షేరు విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. హెల్త్ కేర్, ఫార్మా సూచీల అండతో మార్కెట్లు లాభపడ్డాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 86 పాయింట్లు లాభపడి 55,550కి చేరుకుంది. నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 16,630 వద్ద స్థిరపడింది. ఈ నాటి ట్రేడింగ్ లో 2,090 కంపెనీల షేర్లు అడ్వాన్స్ కాగా... 1,250 కంపెనీలు డిక్లైన్ అయ్యాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (3.69%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (2.07%), ఐటీసీ (1.81%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.80%), టైటాన్ (1.13%). 

టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-1.56%), మారుతి (-1.38%), ఎన్టీపీసీ (-0.75%), యాక్సిస్ బ్యాంక్ (-0.55%), టీసీఎస్ (-0.54%).

  • Loading...

More Telugu News