Sensex: ఎన్నికల ఫలితాల ప్రభావం.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Makets ends in profits on election results day

  • 817 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
  • 249 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 5 శాతానికి పైగా పెరిగిన హిందుస్థాన్ యూనిలీవర్ షేరు  

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపాయి. ఎగ్జిట్ పోల్స్ కు తగ్గట్టుగా ఫలితాలు వెలువడుతుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 817 పాయింట్లు లాభపడి 55,464కి చేరుకుంది. నిఫ్టీ 249 పాయింట్లు పెరిగి 16,594 వద్ద స్థిరపడింది.  

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (5.17%), టాటా స్టీల్ (4.27%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.70%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.28%), యాక్సిస్ బ్యాంక్ (3.04%). 

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-1.28%), డాక్టర్ రెడ్డీస్ (-0.78%), టీసీఎస్ (-0.36%).

  • Loading...

More Telugu News