Nagarjuna: దుబాయ్ లో సోనాల్ తో నాగ్ ఆటాపాట!

The Ghost movie update

  • ముగింపు దశలో 'ది ఘోస్ట్'
  • దుబాయ్ లో జరుగుతున్న చిత్రీకరణ 
  • నాగ్ సరసన సోనాల్ చౌహన్ 
  • దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు

నాగార్జున ఒక వైపున రొమాంటిక్ రోల్స్ చేస్తూనే మరో వైపున యాక్షన్ సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళుతున్నారు. ఈ సంక్రాంతికి 'బంగార్రాజు'గా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను కొల్లగొట్టిన ఆయన, ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్' సినిమాను చేస్తున్నారు. తాజా షెడ్యూల్ షూటింగు దుబాయ్ లో జరుగుతోంది. 

దుబాయ్ లో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను .. కొన్ని రొమాంటిక్ సీన్స్ ను .. ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వదిలారు. మరి కొన్ని రోజుల పాటు అక్కడే షూటింగును జరపనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున సరసన నాయికగా సోనాల్ చౌహాన్ నటిస్తోంది. 

ముందుగా కాజల్ ను అనుకుంటే వ్యక్తిగత కారణాల వలన ఆమె చేయలేకపోయింది. దాంతో సోనాల్ చౌహాన్ ను తీసుకున్నారు. ఇంతవరకూ బాలకృష్ణ సరసన కథానాయికగా ఎక్కువ సినిమాలు చేసిన సోనాల్, నాగ్ తో చేయడం మాత్రం ఇదే మొదటిసారి. నారాయణ దాస్ నారంగ్ .. శరత్ మరార్ .. రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Nagarjuna
Sonal Chouhan
Praveen Sattaru
The Ghost Movie
  • Loading...

More Telugu News